ఫీల్డ్ రిపోర్టర్లకు కరోనా పాజిటివ్‌








ముంబై : మహారాష్ట్ర కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. తాజాగా ముంబైలో కొంతమంది ఫీల్డ్ రిపోర్టర్లకు కరోనా పాజిటివ్‌గా తేలడం తీవ్ర కలకలం రేపుతోంది. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో వీరికి పాజాటివ్‌గా తేలింది. ఇప్పటికే ఓ ప్రముఖ జాతీయ ఛానల్‌కు చెందిన ఆరుగురు రిపోర్టర్లకు కరోనా వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. మరోవైపు తమిళనాడులోనూ ఇలాంటి కేసులు వెలుగుచూశాయి. ఆదివారం చెన్నైలో ముగ్గురు మీడియా ప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారంతా క్వారెంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.